ఖాతా, డేటా తొలగింపు
మీ myStaze ఖాతాను, దానితో ముడిపడిన వ్యక్తిగత డేటాను ఎలా తొలగించాలో ఈ పేజీలో ఉంది. బ్రౌజర్‌లో అయినా యాప్‌లో అయినా తొలగించడానికి డబ్బు అక్కర్లేదు.
ఇక్కడే తొలగించండి
సైన్ ఇన్ చేసి కింద నిర్ధారించండి. తొలగింపు అప్పటికప్పుడే జరుగుతుంది.
సైన్ ఇన్ లేకుండా
myStaze లో వాడే చిరునామా నుంచి "Data Deletion Request" అనే సబ్జెక్ట్‌తో మాకు ఇమెయిల్ పంపండి. 30 రోజుల్లోపు తొలగిస్తాం.
ఏది పోతుంది, ఏది ఉంటుంది
మీ లాగిన్, ఇమెయిల్ చిరునామా, కొన్న టికెట్లతో ఉన్న సంబంధం, చాట్ సందేశాలు తొలగిస్తాం.
కొనుగోలు పత్రాలను అకౌంటింగ్ చట్టం చెప్పినంత కాలం, గరిష్ఠంగా ఆరేళ్లు ఉంచుతాం. అవి ఏ ఖాతాతోనూ ముడిపడి ఉండవు.
తొలగింపు అప్పటికప్పుడే జరుగుతుంది. బ్యాకప్‌లో మిగిలినవి 30 రోజుల్లో గడువు ముగిసిపోతాయి.
myStaze లో ప్రసారాలు మీరే నిర్వహిస్తుంటే మాకు ఇమెయిల్ చేయండి. చివరి చెల్లింపు సర్దుబాటు అయ్యాక నిర్వాహక ఖాతాను మూసేస్తాం.